AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కాలువలు,కల్వర్టులకు శాశ్వత పరిష్కారం ఎక్కడా…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా కాలువలు,కల్వర్టులకు శాశ్వత పరిష్కారం ఎక్కడా అపరిశుభ్రత వాతావరణం లేకుండా చర్యలు వార్డు సుందరీకరణ దిశగా అడుగులు 65 వ వార్డులో వైసీపీ అభ్యర్థి బొడ్డు నరసింహ పాత్రుడు(కేబుల్ మూర్తి) పర్యటన గాజువాక బీసీ రోడ్డు లో గల కాకతీయ రోడ్డులో పర్యటనకు బయలుదేరారు వార్డు అభ్యర్థి బొడ్డు నరసింహ పాత్రుడు(కేబుల్ మూర్తి) వార్డులో ప్రధానమైన కాలువలు,కాల్వర్టుల పరిస్థితిని చూసారు.ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నదానిపై క్షుణ్ణంగా పరిశీలించారు.కాలువల్లో మురుగునీరు పోయే తీరును చూసిన ఆయన వీటికి శాశ్వత పరిష్కారం ఎంతైనా అవసరమని గుర్తించారు. వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో వేకువజామునే వార్డు పర్యటనకు నడుం బిగించారు.కాలువలు,కాల్వర్టులు,వీధి దీపాలు,ప్రభుత్వ రేషన్,పింఛన్లు ఇలా ఒకటేమిటి అన్నింటిపైన ప్రజల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.గ్రేటర్ విశాఖలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా 65 వ వార్డుని తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా చెప్పారు. రోజుకొక కాలనీలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగిశెట్టి శ్రీనివాస్,పాల అప్పలరెడ్డి,తుంపాలతాతారావు,రమణారెడ్డి,రమణయ్య,సత్తిబాబు,కుసుమ,నాగు తదితరులు పాల్గొన్నారు

 101 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.