వర్కింగ్ జర్నలిస్టులకు కార్పేట్ వైద్యం అందించాలి..
1 min read
AABNEWS : వర్కింగ్ జర్నలిస్టుల ప్రధాన సమస్యలు పరిష్కరించరించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విశాఖలోని ఆశీలుమెట్టలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి జర్నలిస్టుల సమస్యలు, హెల్త్ కార్డు విషయంలో తలెత్తుతున్న అంశాలను ఎమ్మెల్యేకి వివరించారు. విధినిర్వహణలో జర్నలిస్టులు అధికంగా వాహనాలపై ప్రయాణించేది అధికంగా ఉండటం వలన జర్నలిస్టులకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ సదుపాయం జర్నలిస్టులందరికీ వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టుల ప్రధానహక్కు అయిన అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం జిఓ నెంబరు 142 అమలుతో చాలా మంది అక్రిడిటేషన్లు కోల్పోయే అవకాశం వుందని యూనియన్ అధ్యక్షుడు ఎమ్మెల్యేకి వివరించారు. సాధ్యమైనంత త్వరగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తాను ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానిల దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టుల సమస్యల పరిష్కారాని తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. జర్నలిస్టులు ప్రభుత్వ సంక్షేమ కార్యాక్రమాలను ప్రత్యేక కథనాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విధినిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కునే కష్టాలను తాను స్వయంగా చూసి తెలుసుకున్నానని, తన రాజకీయ ప్రస్తానంలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో వుందని ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు. అనంతరం స్మార్ట్ సిటీ వేల్ఫేర్ అసోసియేషన్ ద్వారా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యక్రమాల కోసం యూనియన్ అధ్యక్ష, కార్యదర్శిలు ఎమ్మెల్యేకి వివరించారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్,ఉపాధ్యక్షులు రామకృష్ణ,సహకార్యదర్శి పద్మజ,కార్యవర్గ సభ్యులు సాగర్, సభ్యులు నాగు, ఈశ్వర్, సురేష్, వెంకటలక్ష్మి, సూర్య తదితరులు పాల్గొన్నారు.
242 Total Views, 2 Views Today