September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చంద్రబాబు కుట్రతోనే చేయలేదు…

1 min read

AABNEWS : పేదలకు లబ్ధిదారుల పేరుతో ఇళ్లపట్టాలిచ్చి, రిజిస్ట్రేషన్‌ చేయాలనుకున్నాం. కానీ, ప్రతిపక్షనేత కుట్రతో అది సాధ్యం కాలేదు. త్వరలోనే న్యాయపరమైన చిక్కులు తొలిగిన తరువాత లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పిస్తామని రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా గుంకలాం గ్రామంలో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ పైలాన్‌ను ఆవిష్కరించారు.అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అండ్‌ కో కుట్రలతో రిజిస్ట్రేషన్‌లు జరగలేదు. లబ్ధిదారులకు కేవలం ‘డి’ పట్టాలు మాత్రమే ఇస్తున్నాం. న్యాయపరమైన చిక్కులు తొలిగిపోగానే లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పిస్తాం. డిసెంబర్‌ 25న ఇళ్ల పట్టాలు పంచుతామని తెలిసి 24న కోర్టుకు వెళ్లారు. చంద్రబాబు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టే తెలుస్తుంది. పులివెందులలో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టు ద్వారా స్టే తెచ్చారు. అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. విశాఖలో 1.84 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించాం..ల్యాండ్ పూలింగ్‌కు సంబంధంలేనివారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. రాజమండ్రిలో ఆవా భూముల పేరుతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ప్రభుత్వ భూములను కూడా పేదలకు కేటాయించకుండా అడ్డుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణం ద్వారా 30 రకాల వృత్తిదారులకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. చంద్రబాబు, అనుచరుల పిటిషన్ల వల్ల 10% ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కాగానే మిగిలిన వారందరికీ ఇళ్ల స్థలాలు.. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును చట్టబద్ధ హక్కుగా మార్చారు. పేదలకు ఆస్తి హక్కు కల్పించే ప్రయత్నం చేస్తుంటే కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారు. విజయనగరంలో మెడికల్ కాలేజీకి జనవరిలో టెండర్లు.. మార్చి నాటికి మెడికల్ కాలేజీ నిర్మాణం చేపడతాం. రెండేళ్లలో తోటపల్లి, తారకరామ తీర్ధసాగరం ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తాం. ఏడాదిలోగా రాముడువలస లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తామన్నారు.

 281 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.