జగన్‌పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు…
1 min read
AAB NEWS : విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్‌పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంత.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో జగన్‌ను పోలుస్తూ విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఆంధ్రా కిమ్ జగన్ మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. జగన్‌కు ప్రజల కష్టాలు తెలియడం లేదని విమర్శించారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని జగన్ చెప్పారని..కానీ రెండున్నరేళ్ల తర్వాత ఏపీ సీఎం కూడా మారిపోవచ్చని యెద్దేవా చేశారు. ఉపముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చినట్లే..ఏపీకి మొట్టమొదటి మహిళా సీఎంని చేసి జగన్ చరిత్ర సృష్టించాలన్నారు. జగన్ సతీమణి భారతి తదుపరి సీఎం అయితే ప్రజలు సంతోషిస్తారని అభిప్రాయపడ్డారు. భారతి ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు తెలుసుకొని న్యాయం చేస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని… అక్రమాలు జరిగినందున ఏకగ్రీవాలను రద్దు చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.
35 Total Views, 2 Views Today