AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దిశా యాప్ ఉంటే మహళలకు పూర్తి రక్షణ ఉన్నట్లేనని రమణికుమారి అన్నారు…

1 min read

AAB NEWS : దిశా యాప్ ఉంటే మహళలకు పూర్తి రక్షణ ఉన్నట్లేనని
వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారి అన్నారు.
విశాఖపట్నం జిల్లా టౌన్ మండలం టౌన్ లో గల ఉత్తరనియోజకవర్గం మాధవధారలో ఆమె మహిళలకు దిశా యాప్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ దిశా యాప్ ను ప్రతీ మహిళా డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళల రక్షణ కోసం ఎంతగానో అలోచించి మేధావులు,అనుభవజ్ఞుల సలహాలతో ఈ యాప్ రూపకల్పనకు ఆదేశించారన్నారు.దిశా యాప్ ఇప్పటికే దేశవ్యాప్తంగా నాలుగు అవార్డులు సాధించిందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ కు ఎంతో ఆదరణ లభించిందని రమణికుమారి తెలిపారు.రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు పదిహేడు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు.స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ మహిళా,యువత దిశా యాప్ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. అనుకోని ఆపద ఎదురైనప్పుడు యాప్ లోని ఎస్ ఓ ఎస్ బటన్ నొక్కితే నిముషాల్లో పోలీసులు ఆ ప్రాంతానికి చేసుకుంటారని తెలిపారు.యాప్ ద్వారా బాధితులు ఉన్న లొకేషన్ వివరాలు నేరుగా కంట్రోల్ రూమ్,పోలీస్ స్టేషన్ లకు చేరే విధంగా పటిష్ట కార్యాచరణ రూపొందించారని ప్రశంసించారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు జగన్ మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం స్థానిక మహిళలు, విద్యార్థినులతో రమణికుమారి యాప్ ను డౌన్ లోడ్ చేయించారు.ఈ కార్యక్రమంలో మెట్ట దమయంతి వసూపల్లి మసేనమ్మ, విద్యార్థులు మహిళలు పాలుగొన్నారు

 1,979 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.