నిజమైన ప్రజాసేవకు నిలువుటద్దంగా …
1 min read
AABNEWS : రిపోర్టర్ జగన్ : విశాఖపట్నం జిల్లా ములగడ మండలం మల్కాపురం విశాఖపట్టణంలోనే తనకంటూ ప్రత్యేక శైలితో దూసుకుపోతున్న పారిశ్రామిక ప్రాంతం లో గల 60వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పివి సురేష్ ప్రజా సమస్యల పరిష్కారంలోనూ తన మార్కును చూపిస్తున్నారు. వార్డు పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని,అక్కడికక్కడే వాటిని పరిష్కరించేలా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి దగ్గరుండి సమస్యలను పరిష్కరిస్తూ నిజమైన ప్రజాసేవకు నిలువుటద్దంగా నిలుస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో అందుతున్నాయా లేదా అని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. 5 రోజు పర్యటన లో భాగంగా జనతా కాలనీ కొండ ప్రాంతంలో నివసిస్తున్న అటువంటి వారి ఇంటి దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్న p.v.సురేష్ గారికి జనాల్లో మంచి స్పందన కనిపిస్తుంది ఇలాంటి లీడర్ ని మునుపెన్నడు మేము చూడలేదని 60 వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమం లో తదితరులు పాల్గొన్నారు.
144 Total Views, 2 Views Today