AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని బైకులకు తాడులు కట్టి నిరసన…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని బైకులకు తాడులు కట్టి నిరసన తెలిపారు :-DYFIకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు యువతకు తీవ్ర నిరాశ పరిచింది అదేవిధంగా ప్రజల పైన మధ్యతరగతి కుటుంబాల పైన పెద్ద ఎత్తున భారాలు మోపుతూ కార్పొరేట్ కంపెనీలకు ఆదాయాలు తెచ్చేలా బడ్జెట్ తీసుకొచ్చారని దీనిలో భాగంగా పెట్రోల్, డీజిల్ పైన పెంచిన ధరల నిరసనగా మోటార్ బైకులకు తాడులు కట్టి లాగుతూ నిరసన చేయడం జరిగిందని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇంతియాజ్, శివ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కోట్లాది మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని అధికారంలోకి రాకముందు చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా నిరుద్యోగులకు ఉద్యోగం గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా బడ్జెట్లో నిరుద్యోగులకు సంబంధించి ఏ మాత్రం మాట్లాడకపోవడం అదేవిధంగా రైతాంగం అప్పుల ఫాలు అవుతుంటే అప్పులు రద్దు చేయకుండా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. మన పక్క దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు 36, 46, 28, 50, లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలు ఉంటే కానీ మన భారతదేశంలో మాత్రం రోజురోజుకు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతూ వాహనదారులపై పెను భారం వేస్తున్నారు మరోవైపు నూతన బడ్జెట్లో పెట్రోల్ డీజిల్ పై వ్యవసాయం పేరుతో పెట్రోల్2.50 డీజిల్ పై నాలుగు రూపాయలు వేయడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగి ప్రజల పైన పెను భారం పడుతుందని అన్నారు. వన్ నేషన్ వన్ కార్డు వల్ల దేశంలో లక్షలాది మంది పేద ప్రజల కార్లు తొలగించబడతాయి అని అన్నారు. లక్షా 75 వేల కోట్లు సంపాదించే లక్ష్యంగా ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా నమ్ముతున్నారు. ఇన్సూరెన్స్ రంగం 40 నుంచి 70 శాతం విదేశీ కంపెనీలకు అనుమతి ఇవ్వడం వల్ల lic సంస్థ నునీరుగార్చి ప్రజల సొమ్ముకు భద్రత లేకుండా చేసింది .రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి గాని లోటు బడ్జెట్ గురించి గానీ ప్రత్యేక ప్యాకేజీ గురించి గానీ ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించిందన్నారు.యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల గురించి ఊసేలేదు. ఈ రకంగా దేశ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ మోసం చేసే బడ్జెట్ అని తెలుపుతూ బైకులకు తాడు కట్టి నిరసన చేయడం జరిగిందని డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి నడిగడ్డ మా భాష, పట్టణ నాయకులు రఫీ, భాష,రామన్న, చాందు, పాటు తదితరులు పాల్గొన్నారు.

 190 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.