November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మహిళా ఉద్యోగిని పై సూపర్ వైజర్లు గత కొంతకాలంగా వేదింపులకు…

1 min read

AABNEWS : ఓ మహిళా ఉద్యోగిని పై సూపర్ వైజర్లు (వెంకట రమణ, జనార్ధన్)  గత కొంతకాలంగా వేదింపులకు గురిచేసిన ఘటన విశాఖ పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ అరభిందో పరిశ్రమ యూనిట్ 14 లో జరిగింది. గత 6 నెలలుగా కంపెనీలో పనులు చేసుకుంటున్న మహిళపై  సూపర్ వైజర్ లు వేదింపులకు గురిచేయడం తో ఆ మహిళ కుటుంబ సభ్యులకు తెలియజేయడం తో మహిళా సంగం నాయకురాలు గాజువాక చెందిన రోజా గారు తో కలసి కంపెనీ ముందే మహిళ బంధువులు దేహశుద్ధి చేసి ఆ తర్వాత  పరవాడ  పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. నేటి కాలంలో ఫార్మా కంపెనీల్లో మహిళలు  ఒత్తిడిలేని పనులు చేయాలంటే  తమ కోర్కెలు తీర్చాసిందే అన్నట్టు ఉంది ఫార్మా పరిశ్రమల్లో పరిస్థితి.  ఫార్మా కంపెనీలు కూడా మహిళలకి మహిళ  ఉద్యోగులే సూపర్వైజర్ ఉండాలని మహిళా సంఘాలు పరిశ్రమల యాజమాన్యాలకు తెలియజేసాయి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న మహిళలు ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు తెలిజేయాలన్నారు. మహిళలపై రోజురోజుకు లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని దానివలన మహిళలు ఇంటి నుండి బయటకు రావడానికే భయభ్రాంతులకు గురవుతున్నారని
మహిళా సంఘాలు వాపోయారు.

 172 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.