మార్చి 5న రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి…
1 min read
AABNEWS : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఇబ్రహీంపట్నం
విశాఖ ఉక్కును ప్రైవేటికరించరాదని , ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని మార్చి 5న రాష్ట్ర బంద్ కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపునిచ్చింది… బంద్ ఫోస్టర్ ను ఇబ్రహీంపట్నం CITU ఆఫీసు నందు CITU ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం.మహేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ 1966 లో విశాఖ ఉక్కు – ఆంధుల హాక్కు అనే నినాదంతో జరిగిన పోరాటం లో 32 మంది ప్రాణాలు అర్పించారు . 22 వేల ఎకరాల భూమిని ఇచ్చారు. 64 వేల గ్రామాల ప్రజానీకం నిరాశ్రాయులు అయ్యారు. 40 వేల మంది ప్రత్యేక్షం గా , 1లక్ష కార్మికులు పరోక్షంగా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి ప్రతీకైన ఏకైక భారీ స్టీల్ ఫ్లాంట్ ను కేంద్రం లోని మోడీ ప్రభుత్వం దశల వారీ పూర్తిగా అమ్మేయాలని నిర్ణహించటం అంటే ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేయటమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణ కై రాష్ట్ర ప్రజానీకం గళం ఎత్తలాని పిలుపు నిచ్చారు. మార్చి 5 న జరిగే రాష్ట్ర బంద్ కు ఇబ్రహీంపట్నం , కొండపల్లి పట్టణ ప్రముఖులు , వ్యాపార , విధ్యాసంస్థలు , ఆటో , టాటా మ్యాజిక్స్ , ఉద్యోగ , కార్మికులు , చాంబర్ ఆఫ్ కామర్స్ , స్వచ్ఛంద సంస్థలు మద్దతు తెలపాలని కోరారు… ఈ కార్యక్రమంలో VTPS రిజినల్ సెక్రటరీ కె.వాసుదేవన్ , ఇర్ల.కొండలరావు , HIL సెక్రటరీ రామకృష్ణ , ఆశా యూనియన్ సెక్రటరీ సులోచన , మధ్యాహ్న భోజన పధకం యూనియన్ అధ్యక్షరాలు కె.రాజేశ్వరి , టాటా మ్యాజిక్ యూనియన్ సెక్రటరీ బాల మురళి తదితరులు పాల్గొన్నారు
144 Total Views, 2 Views Today