AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వంతెన నిర్మాణం చేయుటకు శంకుస్థాపన…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం అభివృద్ధి పనులకు శంకుస్థాపన… గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గాజువాక జీవీఎంసీ పరిధిలో గల 72 వ వార్డులో వుడా కాలనీ లో వార్డు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి సిరట్ల శ్రీనివాస్ (వాసు) అధ్యక్షతన అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు తిప్పన నాగిరెడ్డి గాజువాక జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీధర్ పాల్గొని చేతుల మీదుగ వంతెన (బ్రిడ్జి) నిర్మాణం చేయుటకు 12.00 లక్షల వ్యయంతో శంకుస్థాపన జరిగినది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోని రోడ్లు కాలువలు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గాజువాక నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అన్నారు . అలాగే 72 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సిరట్ల శ్రీనివాస్ (వాసు) గెలిపించి వార్డు అభివృద్ధి కోసం ఎనలేని సేవ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాసుకి మీ అండదండలు ఉండాలని ఆయన పేర్కొన్నారు.అనంతరం సిరట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి వార్డు ప్రజల తరఫున ఎంతో రుణపడి ఉంటామని ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఈ వంతెన కోసం ఎంతోమంది నాయకులు దగ్గరికి తిరగడం జరిగినది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మా వార్డు సమస్య పరిష్కారం జరుగుతున్నందుకు మేము మా వార్డు ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో రుణపడి ఉంటామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వుడా కాలనీ నాయకులు, బీసీ డైరెక్టర్ అండీ బోయిన లక్షి, దుర్గారావు, పాల సన్యాసిరావు, సత్యంరెడ్డి, అండిబోయిన అప్పారావు, డేవిడ్, గౌరీశంకర్,సన్యాసిరావు, ఈశ్వరరావు, మురళి, చౌదరి, శ్రీనివాస్, రాజు, విశ్వనాధ్, మురళి, 76వ వార్డు అధ్యక్షులు రంభ నారాయణమూర్తి, వైసిపి సీనియర్ నాయకులు మంత్రి శంకర్ నారాయణ, 76 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి రమణ నిర్మల, సాయి మరియు మహిళలు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 402 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.