విశాఖపట్నం జిల్లా అరకు మండలం కూలిపోయిన అట్టగుడ…
1 min read
AAB NEWS : విశాఖపట్నం జిల్లా అరకు మండలం కూలిపోయిన అట్టగుడ కల్వర్టును తక్షణమే పునర్నిర్మించాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్
ఈరోజు తేదీ అరకు వేలి అరకువేలి టౌన్ షిప్ కు రింగురోడ్డు గా పద్మాపురం పంచాయతీ నుండి రణజిల్లెడ మలివలస మాలసింగారం మంజగడ పకనకుడి గ్రామాలను కలుపుతూ చినలబుడు పంచాయతీనకి వెళ్ళు రోడ్డు మార్గం, అట్టగుడ సమీపంలో వున్న రోడ్డుపై కల్వర్టు కూలిపోయిందని దీంతో రాకపోకలకు చాలా ఇబ్బంకరంగా ప్రమాదకరంగా మారిందని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ అన్నారు, ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు కల్వర్టును పరిశీలించిన ఆయన భారీ లోడుతో కంకర రాళ్లు తో బారి లారీలు ఈ రోడ్డుగుండా వెళ్లడం వల్లనే ఈ కల్వర్టు కుంగిపోయిందని ప్రస్తుతం ఈ కల్వర్టు అత్యంత ప్రమాదకరంగా మారిందని కల్వర్టుపై ఉన్న వంతెనకు రెండువైపు కూలిపోయిందని అన్నారు. దీంతో నిత్యం రాకపోకలు సాగించే వారు ఆందోళన చెందుతున్నారని. రాత్రి వేళల్లో మరింత భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో అనేకసార్లు ప్రమాదాలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయని గుర్తు చేసారు. అధికారులకు స్థానిక పాలకులకు ఈ విషయం తెలిసిన వారు చూసి చూడనట్లు ఉన్నారని ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి, కల్వర్టును పరిశీలించి పునర్నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుంకరి బాలమురళి బిసోయి జగన్నాథం చుట్టుపక్కల గ్రామస్తులు మహిళలు యువకులు పాల్గొన్నారు
2,439 Total Views, 6 Views Today