AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విశాఖలో గల ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ సదుపాయం…

1 min read

AABNEWS : విశాఖపట్నం జిల్లా లో గల ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ సదుపాయం సీఎం జగనన్న వచ్చే మూడేళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అన్ని గ్రామాలకూ కల్పించడమన్నది చాలా ముఖ్యమైన అంశమని సీఎం జగనన్న గారు తెలిపారు. ఐటీ రంగం అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్‌ పాలసీలో అంశాలపైనా సమగ్రంగా చర్చించిన సీఎం జగనన్న ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ బలంగా లేకపోతే.. అనుకున్న లక్ష్యాలు సాధించలేమని తెలిపారు. ఐటీ-ఎలక్ట్రానిక్‌ పాలసీపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగనన్న ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగనన్న సమీక్షించారు. రాష్ట్రంలో ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ విస్తృతి, ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్, గ్రామాల్లో ఇంటర్నెట్‌ లైబ్రరీ, కొత్తగా వస్తున్న ఐటీ, ఇతర టెక్నాలజీ అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. విశాఖలో ఎమర్జింగ్‌ టెక్నాలజీ యూనివర్శిటీపైనా సమావేశంలో చర్చించ్చిన సీఎం జగనన్న గారు పాలసీలో పెట్టాల్సిన అంశాలపై అధికారులకు సూచనలు అందించారు. ప్రతి గ్రామాని ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని సీఎం జగనన్న గారు అధికారులను ఆదేశించారు. ఇంటర్నెట్‌ లైబ్రరీని ఏర్పాటు చేయాలని, గ్రామంలో ఎవరైనా సరే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ఉండాలని అన్నారు. వర్క్‌ ఫ్రం హోం చేసుకునే సదుపాయం ఉంటుందని, ఇందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ- లైబ్రరీ కోసం భవనం కూడా కట్టాలని, దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎం జగనన్న ఆదేశించారు. గ్రామంలోని సచివాలయాలు, ఆర్బీకేలు అన్నీ కూడా ఇంటర్నెట్‌తో అనుసంధానం కావాలన్నారు. దీంతోటు అవసరమైన గృహాలకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వాలని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్‌ ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌కు సీఎం జగనన్న గారు ఆమోదం తెలిపారు. విశాఖపట్నంలోఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్కు ఏర్పాటు చేసి ఇందులో హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ, ఇన్‌క్యుబేషన్‌ సెంటర్, ల్యాబ్స్, సీఓఈఎస్, ఐటీ, ఈసీ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసు, స్టేట్‌ డేటా సెంటర్, ఐటీ టవర్స్‌ ఇవన్నీకూడా ఉండాలని సీఎం జగనన్న ఆదేశించారు. ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ యూనివర్శిటీ
విశాఖలో ఏర్పాటు కాబోతున్న యూనివర్శిటీలో రోబోటిక్స్, ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్‌ సైన్సెస్, అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్స్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటివనరులు తదితర రంగాల్లో ఐటీ అప్లికేషన్లపై బోధన, పరిశోధన లక్క్ష్యంగా ఉండాలన్నారు. దేశంలోని ప్రఖ్యాత ఐఐటీ సహా వివిధ సాంకేతిక సంస్థల్లోని నిపుణులు దీనిపై త్వరలోనే నివేదిక సమర్పిస్తారని అధికారులు వెల్లడించారు. ఇంజినీరింగ్‌ సహా.. ఇతరత్రా సాంకేతిక విద్యను అభ్యసించిన వారికి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకూ ఈ యూనివర్శిటీ ఉపయోగపడాలని సీఎం జగనన్న గారు అన్నారు. యూనివర్శిటీ సహా ఐటీ సంబంధిత విభాగాలన్నీ ఒకే చోట ఉండాలని తెలిపారు. మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీలు విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు సమీపంలో.. మూడుచోట్ల కనీసం 2 వేల ఎకరాల విస్తరణలో ఐటీ కాన్సెప్ట్‌సిటీలను ఏర్పాటు చేసేదిశగా చర్యలు తీసుకోవాలని సీఎం జగనన్న గారు ఆదేశించారు. ఈ కాన్సెప్ట్ ‌సిటీల్లో మౌలిక సదుపాయాలు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలన్నారు. నిర్మాణంలో ఆర్కిటెక్చర్‌ యునిక్‌గా ఉండాలని, ప్రతి కాన్సెప్ట్‌ సిటీకి సంబంధించిఒక ప్రత్యేకమైన మాస్టర్‌ ప్లాన్‌ ఉండాలని పేర్కొన్నారు. పాలసీలో ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలన్నారు. ఐటీ ప్రగతికి దోహదపడాలని, రాష్ట్రాభివృద్ధికి సహాయపడాలని సూచించారు. అన్ని అంశాలపై ఆలోచనలు చేసి మంచి పాలసీని తీసుకురావాలన్నారు. కోవిడ్‌ లాంటి మహమ్మారి నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోం పెరిగిందన్న సీఎం జగనన్న గారు వర్క్‌ ఫ్రం హోంను ప్రమోట్‌ చేయాలని సూచించారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఏ రకంగా ఐటీ రంగానికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందిస్తామో పరిశీలన చేసి, దాన్ని పాలసీలో పెట్టాలని తెలిపారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్‌ పార్క్‌పై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం జగనన్న గారు ఆదేశించారు. వీలైనన్ని పరిశ్రమలను తీసుకురావాలని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాలని తెలిపారు.

 94 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.