విశాఖలో విజయసాయిరెడ్డి పాదయాత్ర…
1 min read
AABNEWS : విశాఖ కార్పొరేషన్ : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గేటు వరకు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు పార్లమెంట్లోనూ పోరాడతామన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు అవసరమైన సూచనలు, సలహాలను కేంద్ర ప్రభుత్వానికి అందించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు..
309 Total Views, 2 Views Today