September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విశాఖ ఉక్కు ప్రైవేటికరణ అపాలి…

1 min read

AABNEWS : విశాఖ ఉక్కు ప్రైవేటికరించరాదని , ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని , మార్చి 5 న రాష్ట్ర బంద్ కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపు మేరకు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో సిపిఎం – సిపిఐ – కాంగ్రెస్ – సిఐటియు – ఎస్ఎఫ్ఐ – డివైఎఫ్ఐ మండల కమిటీ ల ఆధ్వర్యంలో ర్యాలీ & ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి వి అంజనేయులు , సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి సిహెచ్ కోటేశ్వరరావు , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోర్ర కిరణ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హాక్కు అనే నినాదంతో జరిగిన పోరాటంలో 32 మంది ప్రాణాలు అర్పించారు.22 వేల ఎకరాల భూమిని ఇచ్చారు.64 గ్రామాల్లో ప్రజానీకం నిరాశ్రాయులు అయ్యారు. అనేక త్యాగాలతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణ మైంది… కేంద్రం కేవలం 5వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. 1లక్ష మంది ఉద్యోగులు , కార్మికులు ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఏకైక భారీ స్టీల్ ఫ్లాంట్ ను కేంద్రం లోని మోడీ ప్రభుత్వం దశల వారిగా ప్రైవేటికరణ చేయటం అత్త సోమ్ము అల్లుడు కి దానం చేసిన చందంగా ఉందని ఆగ్రహం చేశారు.విశాఖ ఉక్కు కోసం నేడు జరిగిన రాష్ట్ర బంద్ కార్మిక ప్రదర్శన , ర్యాలీ విజయవంతం గా జరిగినట్లు తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి యం.మహేష్ మాట్లాడుతూ కేంద్ర BJP ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటికరణ ను అపాలని , లేని పక్షంలో BJP ని ఇంటికి పంపుతారని ఆగ్రహం వ్యక్తంచేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పోతురాజు యేసు దాసు , సిఐటియు బిల్డింగ్ యూనియన్ మండల కార్యదర్శి కె.కుమార్ , VTPS రీజనల్ సెక్రటరీ కె.వాసుదేవన్ , ఇర్ల కొండలరావు , ఐద్వా మండల కార్యదర్శి కె.బేబి సరోజని , మధ్యాహ్నం భోజన పధకం యూనియన్ ప్రెసిడెంట్ కె.రాజేశ్వరి , హాకర్స్ యూనియన్ కార్యదర్శి జె.మల్లేష్ , మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సూరిబాబు , దేవుళ్ళ , రమణ తదితరులు పాల్గొన్నారు…

 168 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.