విశాఖ ఉక్కు ప్రవేటికరణను ఆపాలని…
1 min read
AABNEWS : విశాఖ ఉక్కు ప్రవేటికరణను ఆపాలని, కడప ఉక్కు పరిశ్రమలు ప్రభుత్వ రంగం తో స్థాపించాలని ఉత్తర రాయలసీమ విభజన హామీలను వెంటనే అమలు చేయాలని హిందూపురం ప్రాంతం సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు నిరుద్యోగ ఉద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేశారు CITU కార్మిక సంఘం ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో ఉన్న NGO రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశం సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు గారి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిధిగా రాయలసీమ సబ్ కమిటీ కన్వీనర్ ఓబులు గారు, ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్, ఆర్ సి పి జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఏఐటియుసి జిల్లా నాయకులు దాదా పీర్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఎస్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఓబుల గారు మాట్లాడుతూ వేలాది ఆంధ్రులు త్యాగం చేసి సేద్యపు భూములను కోల్పోయి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు కార్పొరేట్లకు అమ్మడానికి ప్రయత్నాలు చేయటం ఘోరమని జాతీయ సంస్థలను ఒక్కొక్క టిగా అమ్ముకుంటూ దేశ జాతీయ సంస్థ లను ప్రజల ఆస్తులను రైల్వేలు బీఎస్ఎన్ఎల్ .విమానాశ్రయాలు అన్నీ ఒక్కొక్కటిగా దేశాన్ని కార్పొరేట్ ల చేతిలో పెట్టడాని కి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలని విజ్ఞప్తిచేశారు ఈ కార్యక్రమం లో .SFI జిల్లా కార్యదర్శి బాబావలీ సి ఐ టి యు పారిశ్రామిక కన్వీనర్ నరసింహ సూపర్ ఆర్.బి యూనియన్ అధ్యక్షులు జై రామ్ రెడ్డి సదాశివ రెడ్డి ఇ గ్రిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జబ్బు వల్ల కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి జగదీష్ ఆనంద్ రామచంద్ర మల్లికార్జున గురునాథ్ తదితరులు పాల్గొన్నారు

326 Total Views, 2 Views Today