విశ్శబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లను సన్మానిస్తున్న మంత్రులు…
1 min read
AAB NEWS : విశ్శబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లను సన్మానిస్తున్న మంత్రులు ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా బీసీ కార్పోరేషన్లు పనిచేసుకుంటే వెళితే పదవులు వెతుక్కుంటూ వస్తాయ్ విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లకు సన్మానంలో మంత్రులు వెలంపల్లి, బెల్లబోయిన విజయవాడ 06 ప్రభుత్వం అమలు చేసే పథకాలను అర్హులైన వారికి అందచేసేందుకు ప్రభుత్వానికి, ప్రజలకు బీసీ కార్పోరేషన్లు వారధులుగా పనిచేస్తాయని రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం, కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం, విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లను నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటుగా విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బీసీ కార్పోరేషన్లను నామమాత్రంగా ఉండేవన్నారు. 56 బీసీ కార్పోరేషన్లను ఏర్పాటు చేయడంతో పాటుగా నిధులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు. బీసీల సంక్షేమంతో పాటుగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించడానికి ఈ కార్పోరేషన్లు పనిచేస్తాయన్నారు. బీసీ కార్పోరేషన్లను మంచి మనస్సుతో ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారన్నారు. బీసీ కార్పోరేషన్లల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలకు, మహిళలకు 50 రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్.జగన్ మోహన్ రెడ్డిదేనని చెప్పారు. రాష్ట్ర క్యాబినెట్ లోనే 60 శాతం బీసీలకు ప్రాతినిధ్యంతో పాటుగా, ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రుల్లో నలుగురి బీసీ కులాలకు కేటాయించారని వివరించారు. చంద్రబాబునాయుడు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకునేవారని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీసీల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. పనిచేస్తున్న వారికి తమ పార్టీలో ప్రాధన్యత ఉంటుందని చెప్పడానికి నిదర్శనం తోలేటి శ్రీకాంత్ కు విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వడమేనని అన్నారు. బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కులాభివృద్ధికి కృషి చేసే అవకాశం రావడం చాలా అదృష్టమని అలాంటి అదృష్టం తోలేటి శ్రీకాంత్ కు లభించిందన్నారు. బీసీల అభివృద్ధికి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పని చేసుకుంటూ వెళితే పదవులు వెతుక్కుంటూ వస్తాయనడానికి శ్రీకాంత్ నిదర్శనమని అన్నారు. ఫలితం ఆశించి పనులు చేయకూడదని నాయకులకు సూచించారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని వాటిని సక్రమంగా అర్హులకు అందేలా బీసీ కార్పోరేషన్లు చూడాలన్నారు.
సీఎం టూ సీఎం-మల్లాది విష్ణుప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను సీఎం (చీఫ్ మినిస్టర్) నుంచి సీఎం(కామన్ మ్యాన్)కు నేరుగా అందచేయాలన్నదే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విశ్వబ్రాహ్మణులు వృత్తి పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఏవిధంగా పరిష్కరించవచ్చుననే విషయాలను సంఘాల నాయకులు చర్చించుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కృష్ణా పుష్కరాల సమయంలో నగరంలోని విశ్వబ్రాహ్మణుల కళ్యాణ మండపాన్ని అప్పటి ప్రభుత్వం పడగొట్టిందని దానిని పునర్నిర్మాణం చేయడానికి ఏమి చేయాలనే అంశాలను మంత్రులు, ఇతర అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి స్థలం కేటాయింపునకు తన వంతు కృషి చేస్తానన్నారు. బీసీ కార్పోరేషన్లు జిల్లాకు ఒక సమావేశం ఏర్పాటు చేసి విశ్వబ్రాహ్మణ సామాజికవర్గానికి సంబందించిన సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను చూపాలన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తనపై నమ్మకంతో అప్పగించి ఈ పదవికి మరింత మంచి పేరు తెచ్చేలా కృషి చేస్తానన్నారు. సభకు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు,జిల్లా అధ్యక్షుడు రమేష్, విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గొర్తి శ్రీనివాస చక్రవర్తి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమ నిర్వాహక కమిటీ సభ్యులు బ్రహ్మం, నడిపిల్లి ప్రసాద్, బ్రమరాచారి, జగన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం విశ్శబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్ కు, విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ డైరెక్టర్లకు మంత్రులు, సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. వివిధ జిల్లాల నుంచి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు
78 Total Views, 2 Views Today