AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వెంకన్నను దర్శించుకున్న పవన్‌కల్యాణ్…

1 min read

AABNEWS : కృష్ణా జిల్లా: గుడివాడ సమీపంలోని డోకిపర్రు వేంకటేశ్వరస్వామిని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దర్శించుకున్నారు. మెగా కృష్ణారెడ్డి దంపతులు జనసేనానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక పూజలు చేశారు..దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మెగా కృష్ణారెడ్డి, పిచ్చిరెడ్డి డోకిపర్రు గ్రామానికి ఎన్నో సేవలు చేస్తున్నారని, భవిష్యత్‌లో మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు. గ్రామంలో నీటి, గ్యాస్ సరఫరా సేవలు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. రెండు, మూడు ఏళ్లుగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని, డోకిపర్రుకు రావాలని అనుకున్నానని అన్నారు. భవిష్యత్‌లో డోకిపర్రు వెంకటేశ్వర స్వామి ఆలయం మరింత గొప్పగా విరాజిల్లుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. పవన కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు..

 290 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.