AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైఎస్ జగన్ గుడ్ న్యూస్, డిసెంబర్ నుంచి…

1 min read

AAB NEWS : ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు అందించారు. పెన్షనర్లు, ఉద్యోగుల డీఏల (DA to Employees and Pensioners) చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పెన్షనర్లకు 3.144 శాతం పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూలై 2018 నుంచి వర్తించనుంది. దీన్ని జనవరి -2021 నుంచి చెల్లించనున్నారు. జనవరి, 2019 నుంచి మరో 3.144శాతం డీఏ పెంపు వర్తింపు, 2021 జులై నుంచి చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 2019 నుంచి మరో 5.24 శాతం డీఏ పెంపు, జనవరి 2022 నుంచి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు జులై 2018 నుంచి 3.144 శాతం డీఏ పెంపు, దీన్ని 2021 జనవరి నుంచి చెల్లిస్తారు. జనవరి, 2019 నుంచి 3.144శాతం పెంచిన డీఏను జులై 2021 నుంచి చెల్లిస్తారు. జూలై 2019 నుంచి పెంచిన 5.24శాతం డీఏను జనవరి 2022 నుంచి చెల్లించాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సమయంలో జీతాలు, పింఛన్లలో కోత విధించిన విషయం తెలిసిందే. ఈ బకాయిలను డిసెంబర్‌, జనవరి నెలలో చెల్లించాలని కూడా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

 388 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.