AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ వెల్లడించారు…

1 min read

AABNEWS ; రాష్ట్రంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తామని ఇందుకోసం రూ.400 కోట్లు కేటాయించామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారు భయపడాల్సిన పనిలేదని ప్రభుత్వం అన్ని విధాలా సౌలభ్యాలు కల్పిస్తోందన్నారు. సోమవారం విధానసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌ సంబంధిత ఔషధాలకు రూ.81.32 కోట్లు, రెమ్‌డిసివిర్‌కు రూ.28 కోట్లు ఖర్చు చేసేలా మంత్రివర్గంలో తీర్మానించామన్నారు. విక్టోరియా, బౌరింగ్‌ ఆసుపత్రులలో 250 పడకలకు వెంటిలేటర్‌ అనుసంధానం చేస్తామన్నారు. బెంగళూరులో 3వేల పడకలు మేక్‌ షిఫ్ట్‌ ఆసుపత్రి ద్వారా రానున్నాయన్నారు. పోర్టబుల్‌ ఆక్సిజన్‌ను సమకూరుస్తున్నామన్నారు. కొవిడ్‌ వచ్చిన వెంటనే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని తక్కువ లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే చికిత్సలు పొందవచ్చునన్నారు. హోం ఐసొలేషన్‌లో ఉండేవారికి ప్రతిరోజూ కాల్‌సెంటర్‌ నుంచి ఫోన్‌ చేసి మార్గదర్శకాలు అందిస్తామన్నారు.వీటికి తోడు మందుల కిట్‌ను ఇస్తామన్నారు. యూకేలో ఎక్కువ మంది బాధితులకు ఇళ్లలోనే ఉంచి సలహాలు ఇవ్వడం ద్వారా ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గి మృతులసంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోనూ అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో 2లక్షలకుపైగా యాక్టివ్‌కేసులు ఉన్నాయని అందరికీ ఫోన్‌లు చేసేందుకు సిబ్బంది అవసరమని ఇందుకోసమే భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సాయం పొందుతున్నామన్నారు.ప్రైవేటు సంస్థలు రాష్ట్రప్రభుత్వ వినతికి స్పందించాయని బాధితులకు చికిత్సలు అందుతున్నాయని సాధారణ వైద్య పద్దతి ద్వారా కూడా తక్కువ శాతం లక్షణాలు ఉన్నవారికి నయమవుతుందన్నారు. ఆయు్‌షలో ఔషధాలకు చికిత్సలకు మద్దతు ఇస్తామన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు 75 శాతం పడకలు ప్రభుత్వానికి అప్పగించాలని వాటికి సంబంధించిన పర్యవేక్షణ వైద్య ఆరోగ్యశాఖ కొనసాగిస్తుందన్నారు. ఆరోగ్య సురక్షా ట్రస్టు ద్వారా బిల్లులు చెల్లిస్తామన్నారు.ఇందుకు ప్రైవేటు ఆసుపత్రులు అంగీకరించాయన్నారు. కాగా 14రోజులపాటు దూరంగా ఉంటే కరోనా పరంపరను అడ్డుకోవచ్చునని పాజిటివ్‌ నిర్ధారణ అయితే కుటుంబ సభ్యులకు సైతం దూరంగానే ఉండాలని సూచించారు. వ్యాక్సిన్‌ను అందరూ వేయించుకోవాలన్నారు.

 597 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.