శత్రువులు ఎందరో…
1 min read
AABNEWS : కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిదారుణ హత్యకు గురయ్యాడు. సోములవారిపల్లె పొలాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైఎస్ఆర్ జగనన్నకాలనీలో ఈ హత్య జరిగింది. ప్రత్యర్థులు నందం సుబ్బయ్య కళ్లల్లో కారం కొట్టి వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. వారం రోజులుగా నందం సుబ్బయ్య ప్రొద్దుటూరు వైసీపీ నేతలపై, ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో వరుసగా విమర్శలు, ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు కూడా నడిచాయి. ఇంతలో నందం సుబ్బయ్య హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. మరికొన్ని గంటల్లో కలెక్టర్ చేతుల మీదుగా ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్న స్థలంలోనే ఈ హత్య జరిగింది. మున్సిపల్ అధికారులు సభ ఏర్పాట్లలో ఉండగా ప్రత్యర్థులు రెండు వాహనాల్లో సుబ్బయ్యను వెంబడించి హత్య చేశారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, ఆయన బావమరిదే హత్య చేయించారంటున్నారు సుబ్బయ్య కుటుంబం. వైసీపీ నేతల ఇసుక మాఫీయాను ప్రశ్నించినందుకే హత్య చేశారని ఇటు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే చనిపోయిన వ్యక్తి క్యారెక్టర్ మంచిది కాదని ఆయనకు అందుకే చాలా మంది శత్రువులు ఉన్నారని వారిలో ఎవరైనా చంపి ఉంటారని అంటున్నారు.
95 Total Views, 2 Views Today