AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

శ్రీచలసాని ఆంజనేయులు ప్రవేశపెట్టిన క్షీరబంధు పథకం

1 min read

AABNEWS :తిరువూరు పాల శీతల కేంద్ర పరిధిలోని తిరువూరు మండలం, వాముకుంట్ల పాల సంఘం నందు పాలు పోస్తున్న పాల ఉత్పత్తిదారురాలు శ్రీ రత్నాకర కోటంరాజు గత వారం ఆనారోగ్యం కారణంగా మరణించారు. మన కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ శ్రీ.చలసాని. ఆంజనేయులు ప్రవేశపెట్టిన కృష్ణా క్షీరబంధు పథకం ద్వారా అందించు 50,000/-రూ ఆర్ధిక సహాయం యొక్క చెక్కు ను ఆయన భార్య శ్రీమతి నాగమణి కి తిరువూరు పాల శీతల కేంద్రం మేనేజరు *శ్రీ. T. సాంబ శివ మూర్తి, సంఘ అధ్యక్షులు పెద్దగమల్ల నాగేశ్వరరావు చేతులమీదుగా అందజేశారు.ఈ గ్రామంలో రైతుల పశువులుకు గాలికుంటు, గురక వ్యాధులు రాకుండా క్రిష్ణా మిల్క్ యూనియన్ వారూ ఉచితముగా వ్యాక్సిన్ చేయించింది.
ఈ కార్యక్రమంలో పశు వైద్యులు ఎస్.కె.తఫి ఏ.యం.పి.ఓ,ఆర్.వరప్రసాద్ వాముకుంట్ల సంఘం పాలకవర్గ సభ్యులు, పాలఉత్పత్తిదారులు పాల్గొన్నారు.

 152 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.