AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

షరియత్ లో జోక్యం చేసుకోవటమును సహించము ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్…

1 min read

AABNEWS : స్థానిక కోటమిట్ట ఆమినమసీదులోఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ జిల్లా కార్యదర్శి హాఫిజ్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ వఖ్ఫ్ బోర్డు ఇస్లామిక్ షరియత్ లో జోక్యం చేసుకొనే హక్కు లేదు ఇందు కోసం మా దగ్గర మిల్లి సంస్థలు ఉన్నాయి మరియు ఉలమాలు మరియు ముఫ్తీలు ఉన్నారని ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అతీఖుర్ రహమాన్ అష్రఫీ తెలిపినారని అన్నారు. వఖ్ఫ్ బోర్డ్ లకు మరియు కోర్టు లకు ఇస్లాం షరియత్ యొక్క ఏ ఒక్క విషయంలో కూడా జోక్యం చేసుకొనే హక్కు లేదు అది అజాన్ మసాయిల్ అయినా నమాజ్ మసాయిల్ అయినా,మస్జిద్ మసాయిల్ అయినా లేకా మద్రసా మసాయిల్ అయినా .రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ వఖ్ఫ్ బోర్డు తన యొక్క బాధ్యత అయిన వఖ్ఫ్ ఆస్తులను రక్షించటం మరియు వఖ్ఫ్ సంబంధిత ఇన్సిట్టిట్యూట్ లను రక్షించటం మరియు అభివృద్ధి పరచటంలో జోక్యం చేసుకోవాలని చెప్పారు. మీరు మీ యొక్క బాధ్యతలను నెరవేర్చటంలో మీరు ఎంతవరకు ఉన్నారో కర్ణాటక ప్రజలకు చాలా బాగా తెలుసు.మీరు ప్రభుత్వం యొక్క కీలుబొమ్ముగా మారి షరియత్ విషయాలలో మరియు ఇస్లామిక్ షరియత్ లో జోక్యం చేసుకోవటం లాంటి నీచపు పనులను ఆపండి.లాక్ డౌన్ సమయంలో కూడా షరియత్ యొక్క విషయాలలో జోక్యం చేసుకోవడం జరిగింది.ఇది ముస్లిం సమాజానికి చాలా క్షోభపెట్టింది.అంత తెలిసి కూడా వఖ్ఫ్ బోర్డు అనవసరమైన విషయంలో సర్కులర్ లం పాస్ చేసింది.ఇప్పుడు ఫజర్ అజాన్ లౌడ్ స్పీకర్లలలో ఇచ్చే విషయంపై జోక్యం మొదలైందిఅనిఅన్నారు. తన్జీమెఅహ్లెసున్నత్ హాఫిజ్ అబ్దుల్ హఫీజ్ గారు మాట్లాడుతూ దేశంలో లౌడ్ స్పీకర్లు వచ్చినప్పటి నుంచిఇప్పటివరకు అజాన్ లౌడ్ స్పీకర్లలలో ఇవ్వటం జరుగుతుంది.కేవలం 3 లేదా4 నిమిషాల అజాన్ పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ను సాకుగా తీసుకుని ఒక సర్కులర్ ను పాస్ చేయడం ఒక మూర్ఖపు చర్య.ఇలాంటి సమయంలో ముస్లిం నాయకుల మౌనం దేశంలో శాంతిసామరస్యాలను దెబ్బతీస్తుంది. అందువల్ల ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అతీఖుర్ రహమాన్ అష్రఫీ గారు కర్ణాటక రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా ముస్లిములను ఈ విధంగా తెలిపారు మీరు ఇలాంటి సర్కులర్ లను చూసి భయభ్రాంతులకు లోను కావద్దని ,ఇలాంటి సర్కులర్ లను లెక్కచేయవద్దని ఎందుకంటే ఈ సర్కులర్ రాజ్యాంగ విరుద్ధమైనది.మన రాజ్యాంగం మతపరమైన విషయాలలో పనిచేసుకోవటానికి పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చి ఉంది.వఖ్ఫ్ బోర్డు తన యొక్క బాధ్యతలను తెలుసుకొని పనిచేయాలని .అనవసరపు విషయాలలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని.ముస్లిం సమాజం దేనినైనా సహిస్తుంది కాని షరియత్ లో జోక్యం చేసుకోవటాన్ని ఎన్నటికీ సహించదని.వఖ్ఫ్ బోర్డు ఈ విషయాలను గుర్తించుకోవలని తెలిపారు.ఈ కార్యక్రమంలో యస్డిఅమ్జద్, షేక్ బాష, మహబూబ్ బాషాగారు, పాల్గొన్నారు.

 1,219 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.