AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో …

1 min read

AAB NEWS : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామపంచాయతీ లో గ్రామ సర్పంచ్ నామా రాధమ్మ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. వర్షాకాలం సందర్భంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో బీజింగ్ , దోమలమందు పిచికారి చేయించడం జరిగింది .ఈరోజు గ్రామంలో పూడికతీత పనులు, పారిశుద్ధ్య కార్యక్రమం లో భాగంగా రోడ్ల ఇరువైపులా చెత్త తొలగించటం , పల్లె ప్రకృతి వనం లో మొక్కల నాటించడం , జరిగింది. గ్రామంలో పల్లెపకృతి వనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. పల్లెపకృతి లో భాగంగా ప్రతి ఇంటికి6మొక్కలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మొక్కలను మంచిగా పెంచాలని గ్రామస్తులకు తెలిపారు. యమ్ యల్ ఏ సండ్రా సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని, గ్రామ అభివృద్ధి లో సండ్రా సహకారం మరమలేనిదని అన్నారు.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమమునకు గ్రామ సెక్రెటరీ రాజ్యలక్ష్మి, అంగన్వాడి టీచర్లు, ఆశావర్కర్లు, వార్డు సభ్యులు పాల్గొనడం జరిగింది

 190 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.