హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌కు నిమ్మగడ్డ- సింగిల్ బెంచ్ తీర్పు సవాల్…
1 min read
AABNEWS : ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సస్పెన్షన్ విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ సోమవారం తీర్పు ఇచ్చింది. దీన్ని హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. దీనిపై డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసేందుకు నిమ్మగడ్డ తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం అడ్డంకి కాబోదని, ఇవి కేవలం గ్రామాల్లో జరిగే ఎన్నికలే అంటూ నిమ్మగడ్డ చేసిన వాదనను హైకోర్టు సింగిల్ బెంచ్ పట్టించుకోకపోవడంపై నిమ్మగడ్డ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వ్యాక్సినేషన్ పేరుతో ఎన్నికల నోటిఫికేషన్ సస్పెన్షన్ చెల్లదని ఆయన వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని పిటిషన్ రూపంలో డివిజన్ బెంచ్‌లో దాఖలు చేయాలని నిమ్మగడ్డ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిన్న హైకోర్టు సమయం ముగిసినా హౌస్‌మోషన్ పిటిషన్ రూపంలో డివిజన్ బెంచ్‌లో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసేందుకు నిమ్మగడ్డ తరఫు న్యాయవాదులు ప్రయత్నం చేశారు. దింతో పిటిషన్ దాఖలైనా మంగళవారం లేదా బుధవారం మాత్రమే దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంటుంది. హైకోర్టు అత్యవసరమని భావిస్తే మంగళవారం విచారణ జరిపే అవకాశం కూడా ఉంటుంది. సోమవారం ఆన్లైన్ విధానంలో సింగిల్ బెంచ్ పంచాయతీ ఎన్నికల పిటిషన్ విచారించగా.. నిమ్మగడ్డ పిటిషన్‌నూ ఇదే విధానంలో విచారించే అవకాశం .
132 Total Views, 2 Views Today