
AABNEWS : పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి రాత్రి, గుర్తు తెలియని దుండగుడు(లు) చింతలపూడి గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మెడలో వేసి అవమానించడం జరిగింది. దీనికి సంబంధించి చింతలపూడి పోలీస్ స్టేషన్ లో Cr.No.77/2021 u/s 153-A IPC గా కేసు నమోదు చేయడం జరిగింది.ఈ సంఘటనపై పలు దళిత సంఘాలు ధర్నా, రాస్తారోకో మరియు బందు నిర్వహించడం జరిగింది. ఒక పక్క ఈ నిరసన కార్యక్రమాలు వల్ల ప్రజలు ఎవరికి అసౌకర్యం కలగకుండా బందోబస్తు నిర్వహించుచూ, దర్యాప్తు కొనసాగించడం జరిగినది. భాగముగా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లను ఉపయోగించడం జరిగినది మరియు సిసి ఫుటేజీలను పరిశీలించి అనుమానాస్పదంగా కనిపించిన అందరి వ్యక్తులను విచారించడంజరిగినది. కేసు దర్యాప్తు నిమిత్తం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ బృందాలు అన్ని కోణాలలో దర్యాప్తు చేసారు. దర్యప్తులో భాగంగా కలపాల శ్రీనివాసరావు తండ్రి సత్యనారాయణను ముద్దాయిగా గుర్తించడం జరిగింది.ఈ రోజు సదరు కలపాల శ్రీనివాసరావుని అరెస్టు చేసి విచారించగా… రిజర్వేషన్ల వల్ల మెరిట్ కి గుర్తింపు లేకుండా పోతుందని మరియు ఈ మధ్య సుప్రియన్ పేట కి చెందిన ముగ్గురు వ్యక్తులు తనని కొట్టారని, అందువల్ల కక్ష పెంచుకొని ఏదైనా చేయాలని నిర్ణయించుకుని, 30.01.2021 వ తేదీ అర్ధరాత్రి సుమారు 2:30 గంటలకు (31.01.2021) ఇంటి దగ్గర నుండి తను ఒక్కడే బయలుదేరి, మెయిన్ రోడ్ కి వచ్చి దారిలో చిన్న తాడు దొరకగా తీసుకుని, ప్రాఫిట్ షూ కంపెనీ ముందు చెప్పులు కుట్టి దగ్గర ఉన్న నాలుగు పాత చెప్పులు తీసుకుని, చెప్పుల దండ తయారుచేసి, అంబేద్కర్ విగ్రహం మెడలో వేయడం జరిగినది. పంచాయతీ ఆఫీస్ ముందు మరియు బిజీ సెంటర్ లో ఉన్నందున మరియు నాయకులు ఎక్కువగా ఆ విగ్రహానికి దండలు వేస్తూ సదరు విగ్రహానికి ప్రాముక్యత ఇస్తుందున సదరు విగ్రహాన్ని ఎంచుకోవడం జరిగింది. సదరు ముద్దాయి శ్రీనివాస రావు కృష్ణ జిల్లాకి చెందిన వాడు. భార్యాది చింతలపూడి. ఇద్దరు పిల్లలు, పిల్లలు పుట్టిన అనంతరం 18 సంవత్సరాల క్రితం చింతలపూడి కి వచ్చి స్తిరపడ్డాడు. కొంత కాలము, finance వ్యాపారం చేసి నష్ట పోవడము వల్ల సంవత్సరం క్రితం మానేశాడు. భార్య భర్తల మద్య మనస్పర్ధలు వచ్చి, రెండు సంవత్సరాలు నుండి ఇద్దరు విడివిగా ఉంటున్నారు. తరువాత SR Steels నందు సూపర్ వైజర్ గ పనిచేసి మానేసాడు.ఈ మధ్య ఫైనాన్సు బాకీలు వసూలు చేసుకుంటూ ఉన్నాడు. జరిగిన సంఘటన పై పలు సంఘాలు ఎలాంటి హింసకు తావు లేకుండా నిగ్రహం పాటించినందుకు అందరికి ధన్యవాదములు తెలియజేయుచున్నాము.
172 Total Views, 2 Views Today