AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

80 తులాల భారీ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు…

1 min read

AABNEWS : స్థానిక విజయరామరాజు పేటలో గత ఏప్రిల్ 25వ తేదీన పట్నాల శంకర రావు ఇంట్లో సుమారు 80 తులాల భారీ దొంగతనం జరిగిన సంగతి అందరికీ విదితమే. దీనిపై శంకరరావు కుమారుడు రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదుపై అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమైనది. షాప్ పెరటి తలుపులు బద్దలు కొట్టి నేరస్థలంలో కారం చల్లి ఆధారాలు లేకుండా చేయడంతో… దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న పోలీసులు ఎస్పి బి కృష్ణారావు పర్యవేక్షణలో, ఇన్ ఛార్జ్ డి.ఎస్.పి గా ఉన్న మల్ల మహేశ్వరరావు సిసిఎస్ డి ఎస్ పి డి వి ఎస్ ఎన్ మూర్తి అనకాపల్లి, డి ఎస్ పి కె శ్రావణి మేడం సూచనల మేరకు పట్టణ సీఐ భాస్కరరావు ,క్రైం ఎస్ ఐ లక్ష్మీనారాయణ మరియు సిబ్బంది తో కలిసి బృందాలుగా ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. సంఘటన స్థలంను క్లూస్ టీమ్.. డాగ్ స్క్వాడ్ లు తో తనిఖీ చేసినారు. పాత నేరస్థులను విచారణ చేపట్టినారు. దర్యాప్తు లో భాగంగా…. ఇందులో ఇంటి దొంగల హస్తం కూడా ఉండవచ్చని భావించిన పోలీసులు ఆ షాప్ లో పనిచేసిన వ్యక్తుల కదలికలపై కూడా నిఘా వేసి ఉంటారు. నిన్న అనగా తేదీ మధ్యాహ్నం పోలీస్ లకు రాబడిన నమ్మదగిన సమాచారం మేరకు పట్టణ సీఐ భాస్కర రావు, క్లీం ఎస్ ఐ లక్ష్మీ నారాయణ మరియు సిబ్బంది కలిసి సుంకర మెట్ట వద్ద కాపు కాసి ముగ్గురు నేరస్థులు లను అదుపు లోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి కొంత బంగారంను స్వాధీన పరచుకున్నారు. విచారణ లో ఇది అంతా ఇంటి దొంగ పనే అని తెలుసుకున్నారు.ఇంటి దొంగ పన్నాగము, పాత దొంగ పనిA-2 ప్రతాపరావు పట్నాల శంకర రావు షాప్ లో 35సం. ల నుండి ఎంతో నమ్మకంగా పని చేశాడు. అందువలన అతని సమక్షంలోనే ఎన్నో సార్లు శంకర రావు ,రాఘవేంద్రరావులు దేవుని గది లోని లాకర్ లో బంగారు వస్తువులను పెట్టడం తీయడం డబ్బులు దాయడం చేసేవారు. అది చూసి ఆశ కలిగిన దురాశ తో పన్నాగం పన్నాడు. అతని ఇంటికి సమీపంలో లోనే ఉండే పాత నేరస్తుడైన బొచ్చ ఎలియా రాజు తో కలిసి తన యజమాని శంకర రావు గారి ఇంట్లో దొంగతనం చేద్దామని కుట్ర పన్నారు. అయితే బొచ్చ ఎలియా రాజు అంత పెద్ద దొంగతనం చేయగలడో లేడో అనే సందేహంతో ఏదైనా దొంగతనం చేసి నిరూపించుకోవాలని దుర్గారావు రెచ్చగొట్టినాడు. దాంతో ఎలియా రాజు తేదీనాడు తన ఇంటికి సమీపం లోని వెటర్నిటీ ఆసుపత్రి లో గల ప్లీజ్ ను దొంగతనం చేసి తన ఫ్రెండ్ అయిన తిమోతి @ అది సహాయంతో తన పక్కింటి లో పెట్టినాడు. దాంతో నమ్మకం కుదిరిన దుర్గారావు, ఎలియా రాజులు కలిసి తేదీ రాత్రి దొంగతనం చేయుటకు నిర్ణయించుకున్నారు. పాత నేరస్థుడు అయిన ఏలియా రాజు దొంగతనంకి కావాల్సిన పనిముట్లు సిద్ధం చేసుకున్నాడు. బయట రోడ్ మీద తిమోతిని కాపలా పెట్టి ఏలీయా వెనుక నుండి ఇంటి తలుపులు తాళాలు గిడలును ఐరన్ రాడ్, రోకలి బండతో బద్దలు కొట్టి ఏలీయా, దుర్గారావు లు ఇంటిలోకి ప్రవేశించగా, దుర్గారావు దేవుని గది తాళాలు తీసి రాడ్ స్క్రూ డ్రైవర్ లతో బీరువా తలుపులుని తెరచి సుమారు 80.6 తులాల బంగారు వస్తువులను మరియు సుమారు 1.5 లక్షల నగదు దొంగలించినాడు. దొంగిలించిన నగదులో 20 వేల రూ.. ఏలియా కి ఇచ్చి మిగిలిన నగదు ను ఖర్చు పెట్టుకున్నాడు. బంగారం ను కొంత ముగ్గురు సర్దుకున్నారు. మిగిలిన బంగారంను ఏలియా తన ఇంటి ముందు గోతి తవ్వి అందులో డబ్బా తో పాతి పెట్టినాడు. ఏలీయా తనకు తెలిసిన దువ్వాడకు చెందిన కోటి అనే వ్యక్తి వద్ద తన భార్య కి ఆరోగ్యం బాగోలేదని నమ్మబలికి అతని వద్ద సుమారు 16 తులాల బంగారం తనఖా పెట్టి సుమారు 2.5 లక్షలు తీసుకున్నాడు. అందులో నుండి 20 వేలు రూ.. ను తమోత్ కి ఇవ్వగా తిమోతి 10 వేలు తో ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కొని మిగిలిన సొమ్ము ని ఖర్చు పెట్టుకున్నాడు. ఎలియా మిగిలిన సొమ్ము తో జల్పాలు చేసి ఆన్లైన్ పేకాట లో ఒక 60 వేలు ఖర్చు పెట్టి మిగిలిన సొమ్ము లో ఒక 39 వేలు తో సెల్ ఫోన్ కొనుక్కుని మిగిలిన సొమ్ము నీ ఖర్చు పెట్టినాడు. ఈరోజు పాతి పెట్టిన బంగారం లో కొంత బంగారం ను బయటకి తీసుకెళ్ళి అమ్ముకొను ఉద్దేశ్యంతో బయలు దేరగా పోలీసులు పట్టుకున్నారు. వీరి ద్వారా ఈ నేరంకి చెందిన బంగారు వడ్డాణం, నెక్లీసెలు, హారాలు, గొలుసులు, గాజులు, వాచి, ఉంగరాలు, చెవులీలు మొత్తం సుమారు 939.9గ్రా/ 80.6 తులాల బరువు బంగారు నగలుని స్వాధీన పర్చు కున్నారు.వీడిన పాత కేసు మిస్టరీ:పాత సరస్ధుడు అయిన ఏలియా రాజు ని మరింత లోతుగా విచారించగా 2019 ఏప్రిల్ లో గాంధీనగర్ అనకాపల్లి లో మంగిపూడి లక్ష్మీ ఇంట్లో జరిగిన దొంగతనం బయట పడింది. ఆ ఇంట్లో సుమారు 3.5 తులాల బంగారం 1.5 కేజీల వెండి వస్తువులు, మరియు 2.5 లక్షల నగదును ఎలియ రాజు దొంగలించినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ నేరం కి సంబంధించి 2 తులాల బంగారం సుమారు 800 గ్రాముల వెండి స్వాధీనం చేయబడినవి.కేసును చేదించటంలో కీలకంగా పనిచేసిన సిఐ భాస్కర రావు, ఎస్ ఐ లక్ష్మీనారాయణ, ఎస్ ఐ ఎల్. రామకృష్ణ కానిస్టేబుల్స్ డి.లీలకృష్ణ, జి. శ్రీనివాసరావు, కె. వర ప్రసాద్, వి. సతీష్ కుమార్ వై. శంకరరావు, బి. భాస్కర రావు మరియు ఎస్. నారాయణరావు మరియు హెడ్ కానిస్టేబుల్ జె. అర్జున్ లను అనకాపల్లి డి ఎస్ పి అభినందించి నగదు బహుమతి అందించడం జరిగినది.

 803 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.