AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మైలవరం శాసనసభ్యులు…

1 min read

AAB NEWS : కొండపల్లి పురపాలక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు బుధవారం నాడు గొల్లపూడి పార్టీ కార్యాలయం లో మునిసిపల్ కమీషనర్ పర్వతనేని శ్రీదర్ గారు, ఏఈ సాయి గణేష్ , టౌన్ ప్లానింగ్ అధికారిణి పద్మావతి గార్లతో జరిపిన సమీక్ష లో అభివృద్ది పనులు గురించి చర్చించారు మునిసిపల్ పరిధిలో అభివృద్ది సంక్షేమ పథకాలను వేగవంతం చేయాలని, కొండపల్లి ఇబ్రహీంపట్నం గ్రామాల్లో మంచినీటి సరఫరా మెరుగుపరచడం తో పాటు రాబోయే వర్షాకాలం సీజన్ లో మురుగు నీటిపారుదల డ్రైన్ల తో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మునిసిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ది ని అడ్డుకునేందుకు ఎవ్వరు తప్పుచేసిన సహించేది లేదన్నారు. టెండర్లు వేసి పనులు చేపట్టని కాంట్రాక్టర్ల పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సమావేశం లో సిఐ శ్రీదర్ బాబు గారు కార్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు

 1,023 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.