AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు న‌వ సూచ‌న‌లు…

1 min read

AAB NEWS: ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు న‌వ సూచ‌న‌లు (విధేయ‌త‌తో) పేరుతో ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు ఈ రోజు ఏడో లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు తగ్గించాలన్న మీ ఆలోచనను విరమించుకోవాలని, గ్రామ సర్పంచ్ ల అధికారాలను వీఆర్వోలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని ఈ లేఖ‌లో ఆయ‌న కోరారు. ప‌ద‌వీ విర‌మ‌ణ అంటే ప‌ని చేసే ప్ర‌దేశం నుంచి విరామం తీసుకుని ఆ ఉద్యోగి నూత‌న జీవితాన్ని మొద‌లు పెట్ట‌డం అని రఘురామ అన్నారు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత వ‌చ్చే ఆదాయం ఎంతో గణించుకుని వారు త‌మ శేష జీవితాన్ని ఆనందంగా గ‌డిపే ఉత్త‌ర క్ష‌ణాల‌ని ఆయ‌న చెప్పారు. ఇలాంటి అంశంలో జ‌గ‌న్ ఓ నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని వ‌దంతుల రూపంలో వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, ఆ ప‌రిస్థితిని త‌లుచుకుని త‌న మ‌న‌సు విక‌లం అయింద‌ని ర‌ఘురామ చెప్పుకొచ్చారు.

 77 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.