AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

NPR ను నిర్విహించటానికి చేస్తున్న కేంద్ర కదలికలకు వ్యతిరేకంగా జాగ్రత్తగా ఉండండి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా…

1 min read

AABNEWS : స్థానిక మన్సూర్ నగర్ లోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సెన్సెస్(జనాభా గణన)తో పాటు NPR ను కూడా నిర్వర్తించటానికి చేస్తున్న కదలికలకు వ్యతిరేకంగా CAA,NRC మరియు NPR కు వ్యతిరేకంగా నిలబడిన రాష్ట్ర ప్రభుత్వాలు ,పార్టీలు మరియు వివిధ వర్గాల ప్రజలు జాగ్రత్త పడాలని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ O.M.A. సలాం గారు తెలిపారని అన్నారు. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా(RGI) ఒక యాప్(app) ద్వారా జనగణన తో పాటు వివాదాస్పద నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(NPR) ను గ్రౌండ్ స్థాయిలో నిర్వర్తించటానికి సర్వప్రయత్నాలు చేస్తుందని తాజా సమాచారం ద్వారా తెలిసింది.మతం ఆధారంగా దేశ ప్రజలు తమ పౌరసత్వమును కోల్పోవటం వారితో పాటు జీవనం గడిపై ప్రజలు కోరుకోవటం లేదు. అందుకే ఒక సంవత్సరం క్రితం ప్రజలందరూ రాజ్యాంగ విరుద్దమైన CAA-NRC-NPR కు వ్యతిరేకంగా రోడ్ల పై వచ్చారు.బిజెపి ఎతర పార్టీలు ఈ నల్లచట్టానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి మరియు కొన్ని రాష్ట్రాలలో ఈ చట్టానికి వ్యతిరేకంగా రెజ్యులేషన్ పాస్ చేయడం జరిగింది.పబ్లిక్ లో ప్రధానిమంత్రి మోడీ NRC ను దేశవ్యాప్తంగా అమలు చేయమని చెప్పిన ఇప్పుడు NRC ను దొంగచాటున తీసుకొని రావటానికి NPR కోసం కదలికలు మొదలైంది.అందువల్ల మోడీ మాటలు నమ్మదగినవి కావు. NRC కు NPR తో ఏమి సంబంధం లేదని బిజెపి తెలుపుతుంది.వాస్తవం ఏమిటంటే NRC ను దేశవ్యాప్తంగా అమలు పరచటానికి జనగణన తో పాటు NPR డేటా ను స్వీకరింఐటానికి కదలికలు మొదలైనాయి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన CAA-NRC-NPR కు వ్యతిరేకంగా గత సంవత్సరం ఎవరైతే నిరసనలు తెలియజేసారో వారందరూ మరోసారి ప్రజావ్యతిరేక చట్టాలను వ్యతిరేకించాలని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అప్పీల్ చేస్తుంది.అన్ని పార్టీలకు మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ CAA-NRC-NPR కు వ్యతిరేకంగా గొంతు విప్పాలని మరియు జరుగుతున్న పోరాటానికి మద్దతు తెల్పమని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చింది.

 682 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.