AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అభ్యర్థులకు సరికొత్త చిక్కొచ్చిపడిందిప్రచారంలో…

1 min read

AABNEWS: మక్కల్‌నీదిమయ్యం’ (ఎంఎన్‌ఎం) అభ్యర్థులకు సరికొత్త చిక్కొచ్చిపడింది. ప్రచారంలో ప్రజలకు తమ పార్టీ చిహ్నం గొప్పదనం చూపుదామన్న ఉత్సాహంలో వారు ‘టార్చ్‌లైట్‌’ స్విచ్‌ నొక్కుతున్నారు గానీ, అది వెలిగిందో లేదో తెలియక, వెలిగినా ఆ కాంతి బయటకు ప్రసారం కాక పాపం వారు ఇబ్బందిపడుతున్నారు. దీంతో అంతగా ప్రభావం చూపని చిహ్నమే టార్చ్‌లైట్‌ అంటూ ప్రత్యర్థులు చెణకులు విసురుతుండడం ఎంఎన్‌ఎం అభ్యర్థులను ఇరుకున పెడుతోంది. దాంతో స్విచ్‌ నొక్కకుండానే టార్చ్‌లైట్‌ను చూపుతూ ప్రజల్లోకి ఆ చిహ్నాన్ని తీసుకెళ్తున్నారు ఆ పోటీదారులు పాపం. అయితే రాత్రిపూట ప్రచారంలో మాత్రం టార్చ్‌లైట్‌ కాంతి ప్రసారాలు బాగా వస్తుండడంతో వారు కాస్త సంతోషపడుతున్నారు గానీ.. ‘రాత్రివేళలో మాత్రమే టార్చ్‌లైట్‌ ప్రకాశించేనా’ అంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.

 128 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.