అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది…
1 min readAABNEWS : మైదరాబాద్: నగరంలో రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. దీంతో బేగంబజార్ మర్చంట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి బేగంబజార్‌లోని దుకాణాలు సాయంత్రం 5 గంటలకే మూసివేస్తామని ప్రకటించింది. కరోనా నేపథ్యంలో శుక్రవారం నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు నడుస్తాయని వెల్లడించింది. వ్యాపారులు, వినియోగదారులు మాస్కు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించింది.గతంలో కూడా భారీగా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో బేగంబజార్‌లో దుకాణాలను వారం రోజులపాటు మూసివేశారు. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి గతేడాది జూన్ 28 నుంచి వారం రోజులపాటు మార్కెట్‌ను కిరానా మర్చంట్ అసోసియేషన్ స్వచ్ఛందంగా మూసివేసింది.
5,069 Total Views, 4 Views Today