AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఈ ఘటనలో 50 మంది గల్లంతయ్యారు…

1 min read

: ఉత్తర ఆఫ్రికా దేశం ట్యునీషియా తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 50 మంది గల్లంతయ్యారు. లిబియా నుంచి యూరప్ వెళ్తున్న పడవ మునిగినట్టు ట్యునీషియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్యునీషియా దక్షిణ తీరంలో ఆయిల్ ప్లాట్‌ఫాంపై అతుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన 33 మందిని తమ అధీనంలోకి తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మొహమ్మద్ జిక్రీ తెలిపారు. ప్రాణాలతో బయటపడిన 33 మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) ప్రతినిధి ఫ్లావియో డి గియాకోమో చెప్పారు. కనీసం 50 మంది సముద్రంలో గల్లంంతయ్యారని వెల్లడించారు.90 మందికి పైగా వలస ప్రయాణికులతో కూడిన ఈ పడవ ఆదివారం లిబియా ఓడరేవు జువారా నుంచి బయల్దేరింది. పడవ మునిగిపోవడానికి కారణమేమిటో వెంటనే స్పష్టంగా తెలీదు. కానీ, ఐరోపాకు ఉత్తర ఆఫ్రికా తీరం నుంచి కోస్ట్‌గార్డ్ గుర్తించకుండా ఉండటానికి కఠినమైన వాతావరణంలో కూడా రాత్రి సమయాల్లో బయల్దేరుతుంటాయి. ట్యునీషియాకు చెందిన బలగాలు జువారాకు వాయువ్యంగా 100 కిలోమీటర్ల (70 మైళ్లు) జార్జిస్ నౌకాశ్రయానికి తీసుకువచ్చారు.గల్లంతైన 50 మందికి సంబంధించి వివరాలు తమకు తెలియదని డి గియాకోమో తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రకారం.. గత సంవత్సరం మధ్యధరాలో కనీసం 1,200 మంది వలసదారులు మరణించారు. ఐరోపాకు వలస వెళ్ళేవారికి లిబియా కీలక మార్గం.. 2021 ప్రారంభం నుంచి ఉత్తర ఆఫ్రికా తీరం నుంచి ఇటలీ, మాల్టా వరకు మధ్యధరా సముద్రం దాటే క్రమంలో 500 మందికి పైగా మరణించారు.

 1,026 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.