AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఉత్తరాఖండ్‌ సీఎం రావత్‌ రాజీనామా

1 min read

AABNEWS : దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ తన పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ నేతల నుంచే అసంతృప్తి ఎదురవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ బేబీ రాణి మౌర్యను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. రావత్‌ నాయకత్వంపై రాష్ట్ర భాజపా నేతల్లో కొంతకాలంగా అసంతృప్తి నెలకొన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదే విషయమై గత కొన్ని రోజులుగా కనీసం పదిమంది పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు దిల్లీలో మకాం వేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన భాజపా అధిష్ఠానం ఇటీవల ఇద్దరు సీనియర్‌ నేతలను రాష్ట్రానికి పంపింది. రాష్ట్ర కోర్‌ సభ్యులతో వారు సమావేశమయ్యారు. మరోవైపు రావత్‌.. సోమవారం దిల్లీ వెళ్లి భాజపా అధిష్ఠానాన్ని కలిశారు.  2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో త్రివేంద్ర సింగ్‌ రావత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు..

 543 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.