AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎమ్మెల్యే కళావతి బురియా శనివారం ఉదయం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు…

1 min read

AABNEWS : కోవిడ్‌కు చికిత్స తీసుకుంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కళావతి బురియా శనివారం ఉదయం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె వయస్సు 49 సంవత్సరాలు. ఈనెల 11న ఇండోర్‌లోని ఆసుపత్రిలో ఆమె చేరారు. ఆ సమయంలో ఆమెకు ఆక్సిజన్ లెవల్స్ 82 శాతం ఉన్నాయని, దాంతో వెంటిలేటర్‌పై ఉంచామని, శుక్రవారం రాత్రి 2.30 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో 3.20 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారని డాక్టర్ వివేక్ జోషి తెలిపారు. కళావతి బురియా మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ సంతాపం తెలిపారు. ఆమె ఎంతో అంకితభావం కలిగిన, చురుకైన నేత అని, నియోజకవర్గం ప్రజలతో మమేకమై పని చేసేవారని అన్నారు. 2018లో జోబట్ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కళావతి బురియా ఎన్నికయ్యారు

 397 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.