ఎలుగుబంటి భీభత్సం…
1 min read
AAB NEWS : కోర్బా: చత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఎలుగుబంటి దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం అంగ్వాహి జిల్లాలో ఈ ఘటన జరిగింది. దేవ్‌గఢ్ అటవీ ప్రాంతం నుంచి కలపను సేకరించి తీసుకొస్తుండగా ఎలుగుబంటి ఒక్కసారిగా వారిపై దాడిచేసి చంపేసినట్టు అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున అటవీ అధికారులు వారి మృతదేహాలను గుర్తించారు. ఆ సమయంలో ఎలుగుబంటి మృతదేహాలకు సమీపంలోనే కూర్చుని ఉండడంతో సహాయ కార్యక్రమాలు ఆటంకం ఏర్పడింది. గాయపడిన ముగ్గురిలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు అధికారులు తెలిపారు. చికిత్స అనంతరం ఒకరిని డిశ్చార్జ్ చేశారు. ఎలుగుబంటి నుంచి తనను తాను కాపాడుకోవడానికి చెట్టెక్కిన ఓ గ్రామస్థుడిని జేసీబీ సాయంతో రక్షించారు. ఎలుగుబంటిని అడవిలోకి తరిమేసిన అనంతరం మృతదేహాలను సేకరించి ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద అధికారులు రూ.25 వేలు చొప్పున అందించారు. పరిహారానికి అవసరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత మిగతా రూ. 5.75 లక్షలను అందించనున్నట్టు పేర్కొన్నారు.
24 Total Views, 2 Views Today