AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కథానాయకుడు రజనీకాంత్‌ దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం వరించడంఎంతో సంతోషంగా ఉంది…

1 min read

AABNEWS : అగ్రకథానాయకుడు రజనీకాంత్‌ను దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం వరించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌కు అభినందనలు తెలుపుతూ ఆయన ట్వీట్‌ చేశారు. ” తలైవాను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించడం ఎంతో సంతోషంగా ఉంది. రజనీకి నా అభినందనలు. కఠోరంగా శ్రమించే అరుదైన వ్యక్తుల్లో ఆయనొకరు.విభిన్నమైన పాత్రలు పోషించే అద్భుతమైన, మంచి మనస్సున వ్యక్తి శ్రీ రజనీకాంత్‌” అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం సూపర్‌స్టార్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ వరుస ట్వీట్లు పెడుతున్నారు.

‘వెండితెర వేదికగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవచ్చని నిరూపించిన, సూపర్‌స్టార్‌, నా ఆప్తమిత్రుడు రజనీకాంత్‌.. దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి నూరుశాతం అర్హుడు’ – కమల్‌హాసన్‌

‘ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు తలైవాకు దక్కడం సంతోషంగా ఉంది. ఆయన్ని ప్రశంసించే వయసు నాకు లేదు. ఆయన గొప్పతనం చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను’ – రాఘవా లారెన్స్‌

‘దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం పొందిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ – వెంకటేశ్‌

‘సినిమా రంగంలో ఎంతో విశేషంగా చెప్పుకునే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు 2020 సంవత్సరానికి గానూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు దక్కింది. పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌ రజనీకాంత్‌కు అభినందనలు. తలైవా అభిమానులకు ఇదో గొప్ప శుభవార్త’ – గోపీ మోహన్‌ రచయిత

 143 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.