September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కోతి కురిపించిన వర్షం…

1 min read

AABNEWS :  ఓ కోతి పిచ్చి చేష్టలు టెన్షన్ పుట్టించాయి. నాలుగు లక్షల నగదు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లిన ఆ వానరం.. దాంట్లో ఉన్న డబ్బును వెదజల్లింది. ఈ ఘటన సీతాపూర్‌లోని రిజిస్ట్రీ ఆఫీసు వద్ద జరిగింది. వికాశ్ భవన్ రిజిస్ట్రీ ఆఫీసు వద్ద ఓ సీనియర్ సిటిజన్ చేతిలో ఉన్న నగదు బ్యాగును కోతి లాక్కుని పారిపోయింది. బ్యాగుతో పరారైన ఆ కోతి.. సమీపంలో ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కి.. బ్యాగులో ఉన్న సుమారు 12 వేల కరెన్సీ నోట్లను కిందకు పడేసింది. దీంతో అక్కడ ఉన్న జనం ఆ డబ్బును ఏరుకునే పనిలో పడిపోయారు. అయితే అనేక ప్రయత్నాల తర్వాత కోతి నుంచి కరెన్సీ బ్యాగును చేజిక్కించుకున్నారు. నగరంలోని కోత్వాల్ ఏరియాలో ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

 313 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.