కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం…
1 min read
AAB NEWS : థానే : మహరాష్ట్రలోని ఒక కోవిడ్-19 ఆసుపత్రిలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో అప్రమత్తతతో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసు అధికారులు సోమవారం వెల్లడించారు. ఉల్హాస్‌నగర్‌లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఎసి యూనిట్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు రేగాయని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళ అధికారులు వెంటనే అక్కడకు చేరుకొని గంటలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల ప్రభావంతో ఆసుపత్రి పరిసరాల్లో భారీగా పొగ ఆవరించింది. మంటలు రేగిన వెంటనే సమీపంలోని బ్లాక్‌లో ఉన్న దాదాపు 20 మంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
26 Total Views, 2 Views Today