AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం…

1 min read

Rajinikanth and Others At The Inauguration of MGR Statue

AAB NEWS: వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లొచ్చిన సినీ నటుడు రజనీకాంత్ మళ్లీ షూటింగులతో బీజీ అవుతున్నారు. తన తాజా చిత్రం ‘అన్నాత్తే’ షూటింగ్ ను ఆయన మళ్లీ ప్రారంభించారు. ఈ చిత్రానికి చెందిన గత షెడ్యూల్ హైదరాబాదులో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్ కోల్ కతాలో జరగనుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది. ఈ చివరి షెడ్యూల్ కోసం రజనీకాంత్ కోల్ కతా చేరుకున్నారు. ఈరోజు నుంచే షూటింగ్ ప్రారంభం కానుంది. షూటింగ్ నేపథ్యంలో చిత్రంలో నటిస్తున్న కీలక నటీనటులంతా కోల్ కతా చేరుకున్నారు. నవంబర్ 4న దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు నయనతార, కీర్తి సురేశ్ నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

 45 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.