జీన్స్ వేసుకోలేదని భార్యకు తలాక్…
1 min read
AABNEWS : మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో ఒక వ్యక్తి తన భార్య జీన్స్ వేసుకుని, డాన్స్ చేయలేదని తీన్ తలాక్ చెప్పాడు. తరువాత అతను అత్తారింటికి వెళ్లి తనపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన చట్టుపక్కలవారు అతనిని కాపాడటమే కాకుండా పోలీసులకు ఈ సమాచారాన్ని అందించారు. వివరాల్లోకి వెళితే మీరట్‌లోని న్యూ ఇస్లాంనగర్ నివాసి అమీరుద్దీన్ కుమార్తె మహజబీకి ఎనిమిదేళ్ల క్రితం హాపుర్ పరిధిలోని పిల్ఖువా నివాసి అనస్తో నిఖా జరిగింది. అయితే గత కొంతకాలంగా అసన్ తన భార్య మహజబీని వేధిస్తూ వస్తున్నాడు.
ఈ నేపధ్యంలో పెద్దలు కలగజేసుకుని వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మహజలీ…. భర్త తనను జీన్స్ వేసుకోవాలని, డాన్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించింది. ఈ మాటలు విన్న పెద్దలు వారికి నచ్చజెప్పి ఇంటికి పంపించేశారు. అయితే రెండు రోజుల క్రితం అనస్ ఆమె ఇంటికి వచ్చి, తీన్ తలాక్ చెప్పాడు. తరువాత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన చుట్టుపక్కలవారు అతనిపై నీళ్లు పోసి నిప్పును ఆర్పారు. దీంతో అనస్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని అక్కడివారు పోలీసులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
24 Total Views, 4 Views Today