AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నా తల్లిని కించపరిచేలా విమర్శలు…

1 min read

AABNEWS : చెన్నై సాధారణ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే డీఎంకే వారు ఏవేవో మాట్లాడుతూ కించపరుస్తున్నారని సీఎం పళనిస్వామి విమర్శించారు. తన తల్లి గ్రామీణ ప్రాంతంలో ఉండేవారని, కన్నుమూసిన ఆమె గురించి కించపరుస్తూ మాట్లాడుతున్న వారికి భగవంతుడు తగిన శిక్ష వేస్తాడని కంటతడి పెట్టుకున్నారు. చెన్నై తిరువొత్తియూరులో ఎన్నికల ప్రచారంలో ఆయన స్పందించారు.

మరోవైపు ముఖ్యమంత్రి పళనిస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై డీఎంకే ఎంపీ ఎ.రాజాపై కేంద్ర నేర విభాగ పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నై థౌజండ్‌లైట్స్‌ ప్రాంతంలో శనివారం ఎన్నికల ప్రచార సమయంలో రాజా ఈ వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, తూత్తుకూడి ఎంపీ కనిమొళి, పీఎంకే వ్యవస్థాపకుడు రామదాసు తదితరులు కూడా రాజా వైఖరిని ఖండించారు.

 212 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.