AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత యువకుడుఆ యువకుడు మోకాళ్లపై కూర్చుని ఉమ్మి నాకుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది…

1 min read

AABNEWS : టెక్నాలజీలో దూసుకుపోతున్నాం అని చెప్పుకునే ఈకాలంలో కూడా ఇంకా కులాలు…మతాలు,అంటరానివారంటూ వివక్షలు కొనసాగుతునే ఉన్నాయి. ఎవరి పుట్టుకలు ఎవరి చేతుల్లోను ఉండవు. అటువంటిది దళితులుగా పుట్టారని వారిపై వివక్షలు చూపించటం అనే అనే అనాగరిక జాడ్యాన్ని మాత్రం వదిలించుకోవటంలేదు ఈ నాగరిక ప్రపంచంలో జీవించే మనుషులు. ఈ క్రమంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఓ దళిత యువడిని అగ్ర కులం అని చెప్పుకునే గ్రామ పెద్దలు ఆ యుడకుడిని దారుణాతి దారుణంగా అవమానించారు.డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి రోజునే బీహార్ లో జరిగిన ఈ ఘటన సభ్య సమాజాన్ని సిగ్గుతో తలవంచుకునేలా చేసింది. అగ్ర వర్ణకుల పెద్దలు నేలపై ఉమ్మి వేసి..ఆ ఉమ్మిని బలవంతంగా దళిత యువకుడితో నాలుకతో నాకించిన ఘోర ఘటన బీహార్ లోని గయాలోని వజీర్‌గంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అంతేకాదు ఓ పాత్రలో గ్రామ పెద్దలు మూత్రం పోసి అతనితో బలవంతంగా తాగించారు..యువకుడితో ఉమ్మి నాకించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.గయాలోని వజీర్‌గంజ్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఓ దళిత యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన గ్రామ పంచాయితీ పెద్దలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే పంచాయితీ పెట్టించారు. పంచాయితీకి సదరు యువకుడిని పిలించారు. అశ్లీల పదాలతో పరుషంగా దూషించారు. దారుణంగా అవమానించారు. నేలపై ఉమ్మి వేసి ఆ ఉమ్మిని అతడితో బలవంతంగా నాకించారు. ఓ పాత్రలో మూత్రం పోసి ఆ మూత్రం తాగాలని బలవంత పెట్టి అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. ప్రేమించినందుకు ”శిక్షగా” పంచాయితీలో ఉన్న పలువురు వ్యక్తులు నేలపై ఉమ్మి వేసి ఆ ఉమ్మిని ఆ యువకుడు మోకాళ్లపై కూర్చుని ఉమ్మి నాకుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం మూత్రం తాగాలంటూ పంచాయితీ పెద్దలు అతడిని బలవంతం చేశారు.17 ఏళ్ల దళిత యువకుడు ఇటీవల తాను ప్రేమించిన యువతితో కలిసి పారిపోయి వివాహం చేసుకున్నాడు. దీంతో యువతి తల్లిదండ్రులు ఆ జంటను వెతికి వెతికి పట్టుకుని పంచాయితీ పెట్టించారు. అతడికి శిక్ష విధించాల్సిందేనని పట్టుపట్టారు. దీంతో పెద్దలు ఇటువంటి మరొకరు చేయకుండా ఉండాలంటే మా ఉమ్మి నాకాలి..మా మూత్రం తాగాలంటూ తీర్పునిచ్చారు. పంచాయితీ సభ్యులు, సర్పించి ముందే ఆ దళిత యువకుడిని అమానుషంగా కొట్టి హింసించారు. ఆ తరువాత పెద్దలందరూ నేలపై ఉమ్మి వేసి అతనితో నాకించారు. ఈ ఘటనపై వీడియో వైరల్ కావడంతో గయా పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామనీ… ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని గయా ఎస్‌ఎస్పీ ఆదిత్య కుమార్ తెలిపారు.

 182 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.