AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మరోసారి ఇద్దరూ కలిసి నటించనున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నా.. ఇప్పటి వరకూ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు…

1 min read

AABNEWS : చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు సినిమాల్లో అత్యున్నత అవార్డుగా పరిగణించే దాదా సాహెల్ ఫాల్కే అవార్డు దక్కడంపై మరో సూపర్ స్టార్ కమల్ హాసన్ స్పందించాడు. ట్విటర్‌లో రజనీకి శుభాకాంక్షలు చెప్పాడు. సూపర్ స్టార్‌, నా ప్రియ మిత్రుడు రజనీకాంత్ ఈ అవార్డుకు 100 శాతం అర్హుడు. అతనికి ఈ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉంది అని కమల్ తమిళంలో ట్వీట్ చేశాడు. రజనీకాంత్‌, కమల్ హాసన్ కలిసి 16 సినిమాల్లో నటించడం విశేషం. ఈ ఇద్దరూ చివరిసారి 1985లో హిందీ మూవీ గిరఫ్తార్‌లో కలిసి నటించారు. మరోసారి ఇద్దరూ కలిసి నటించనున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నా.. ఇప్పటి వరకూ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. 2019 ఏడాదికిగాను రజనీకి ఈ అత్యున్నత అవార్డు దక్కింది. గతేడాది కొవిడ్ కారణంగా దీనిని ప్రకటించలేదు. రజనీని ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీలో సింగర్లు ఆశా భోస్లే, శంకర్ మహదేవన్‌, నటులు మోహన్‌లాల్‌, బిశ్వజీత్‌, దర్శకుడు సుభాష్ ఘాయ్ ఉన్నారు.

 177 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.