AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం…

1 min read

AABNEWS:ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రాజ్ కుంద్రాపై ఐపీసీ 420 (మోసం), 292, 293 (అశ్లీల, అసభ్య ప్రకటనలను ప్రదర్శించడం), 34 (సాధారణ ఉద్దేశం), ఐటీ చట్టంలోని 67, 67ఏ సెక్షన్లు (మహిళా అసభ్య ప్రాతినిథ్యం) కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా తమ వద్ద బలమైన సాక్షాలున్నాయని పోలీసులు చెపుతున్నారు. మన దేశంలో అశ్లీలతను నియంత్రించేందుకు ఐపీసీ కిందకు ఐటీ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఇన్ డీసెంట్ రెప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్స్ యాక్ట్ అండ్ యంగ్ పర్సన్ యాక్ట్ ఐపీసీ ఐటీ యాక్ట్ 2000 కింద ఆశ్లీల వీడియోలపై నిషేధం విధించారు. రాజ్ కుంద్రాపై ఈ చట్టాల కింద నేరం రుజువైతే మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కేసులో 2013లో రాజ్ కుంద్రాను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు.

 134 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.