AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విస్తరిస్తున్న బర్డ్‌ఫ్లూ…

1 min read

AABNEWS : కరోనాతో దేశం సతమతమవుతుంటే మరోవైపు చాపకింద నీరులా బర్డ్‌ఫ్టూ విస్తరిస్తోంది. తాజాగా ఈ మహమ్మారి నాలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. తొలుత రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వెలుగుచూసిన ఈ వైరస్ క్రమంగా ఇతర రాష్ట్రాలకు పాకుతోంది. తాజాగా కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లోని బర్డ్‌ఫ్లూను గుర్తించారు. కేరళలోని కొట్టాయం, అలపూజా జిల్లాలో భారీ సంఖ్యలో బాతులు, కోళ్లు మృత్యువాత పడ్డాయి. దాంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వాటి నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్కూరిటీ యానిమల్ డీసీజస్‌కి పంపించారు. ఆ ప్రాంతాలకు ఒక కి.మీ. పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న బాతులు, కోళ్లు 40వేలకు పైగా వాటిని చంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు

 438 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.