వీసాల పేరుతో విద్యార్థులకు టోపీ…
1 min read
AAB NEWS : వాషింగ్టన్: ఏపీకి చెందిన దంపతులు అమెరికాలో భారీ మోసానికి పాల్పడ్డారు. వీసాల పేరుతో తెలుగు విద్యార్థుల నుంచి లక్షల్లో వసూలు చేసి, వారి నోట్లో మట్టికొట్టారు. వివరాల్లోకి వెళితే.. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన సునీల్, ప్రణీత దంపతులు ఓ కన్సల్టెన్సీ కంపెనీ పెరుతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పరిచయం అయ్యారు. వారికి ఎఫ్1, హెచ్1బీ వీసాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. వీసాల కోసం విద్యార్థుల నుంచి లక్షల్లో వసూలు చేశారు. అనంతరం కనిపించకుండా పారిపోయారు. దీంతో తాము మోసపోయినట్టు గ్రహించిన ఆ విద్యార్థులు అట్లాంట హోం ల్యాండ్ సెక్యూరిటీని ఆశ్రయించి, సునీల్, ప్రణీత దంపతులపై ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో ఈ దంపతులపై ఇంటర్‌పోల్ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. వీసాల పేరుతో విద్యార్థుల నుంచి ఈ దంపతులు వసూలు చేసిన మొత్తం సుమారు రూ.10కోట్ల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ డబ్బును సునీల్ తన తండ్రికి అకౌంట్లోకి బదిలీ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఈ దంపతులు ఇద్దరూ యూరప్‌కు పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అనధికారిక కన్సల్టెన్సీలను నమ్మొద్దని పోలీసలు సూచిస్తున్నారు.
36 Total Views, 2 Views Today