వేషం మార్చుకున్న కరోనా…
1 min read
AABNEWS : ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి తాజాగా మరోసారి తన వేషం మార్చుకుంది. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో కొత్త రకం కేసులు బయటపడగా.. తాజాగా ఆఫ్రికా దేశమైన నైజీరియాలో మరో రకం కరోనా వైరస్‌ను గుర్తించారు.బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో జన్యుమార్పిడి వైరస్ కేసులు బయటపడిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం వైరస్ 70శాతం వేగంగా వ్యాపించే అవకాశమున్నట్లు వార్తలు రావడంతో ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమయ్యాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే భారత్ సహా అనేక దేశాలు యూకేకు విమాన సర్వీసులను నిలిపివేశారు. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా నుంచి లండన్ వచ్చిన ఇద్దరిలో ఇంకో రకం వైరస్ బయటపడింది. బ్రిటన్‌లో వెలుగుచూసిన వైరస్‌ను మించిన వేగంతో వ్యాపించే లక్షణాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వైరస్‌కు ఉన్నాయని, ఉత్పరివర్తనం కూడా త్వరత్వరగా జరుగుతుందని
502 Total Views, 4 Views Today