18 ఏళ్ల కుర్రాడు వరల్డ్ రికార్డ్…
1 min read
AABNEWS : 18 ఏళ్ల కుర్రాడు అభిషేక్ నవలే.. 100 మీ.ఇన్లైన్ స్కేటింగ్‌ను 12.85 సెకన్లలోనే పూర్తిచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ సేల్స్బరి పేరిట ఉన్న రికార్డ్(13.24సెకన్ల)ను బ్రేక్ చేశాడు. బెల్గాంలోని ఆటోనగర్‌కు చెందిన అభిషేక్ 14ఏళ్లుగా స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. బెల్గాం రోలింగ్ స్కేటింగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. పలు ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. వరల్డ్ రికార్డ్ అకాడమీ అవార్డును మూడుసార్లు గెలుచుకున్నాడు. దానితో పాటు రెండు లిమ్కా బుక్ రికార్డ్లను తన పేరిట నెలకొల్పాడు. పోర్చుగల్‌లో జరిగిన 10వ అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు ఎంపికయినప్పటికీ ఇన్లైన్ మెటీరియల్ కొనే స్థోమత లేదని, అప్పడు హీరో దర్శన్ ఆర్థిక సాయం చేశారని అభిషేక్ చెప్పారు.
167 Total Views, 2 Views Today