September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

2వేల ఏళ్లనాటి ఆహారం లభ్యం…

1 min read

AABNEWS : అగ్నిపర్వతం పేలి ఓ నగరం భూస్థాపితం అయిపోయింది. దీని కోసం గాలిస్తున్న పరిశోధకులకు తాజాగా ఓ అద్భుతమైన ఆధారం దొరికింది. పాంపేయ్ ప్రాంతంలో తవ్వకాల్లో ఈ డిస్కవరీ జరిగింది. ఇక్కడి మట్టిలో ఓ పురాతన కాలపు దుకాణం దొరికింది. ఇది ప్రస్తుతం మనం చూస్తున్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వంటిదని పరిశోధకులు చెప్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ దుకాణంలోని కొన్ని మట్టి పాత్రల్లో ఆ కాలం నాటి ఆహార పదార్థాలు, డ్రింకుల అవశేషాలు కూడా ఉన్నాయట. ఈ నగరం 79 ఏడీలో భూస్థాపితం అయిపోయినట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఇప్పుడు తవ్వకాల్లో దొరికిన ఈ దుకాణం గోడలు పసుపు రంగులో ఉన్నాయని, అలాగే దీనిపై ఆహార పదార్థాల కోసం ఉపయోగించన జంతువుల బొమ్మలు కూడా వేసి ఉన్నాయని పరిశోధకులు తేల్చారు.

 310 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.